ఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి లాభమేంటి: ఎంపీ అర్వింద్

ఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి లాభమేంటి: ఎంపీ అర్వింద్

ఫామ్ హౌస్ సినిమా ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఆధారాలు ఉంటే భయటపెట్టాలి కాని.. మాటలు ఎందుకు అని విమర్శించారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి వచ్చే లాభమేంటని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మాట్లాడింది అవాస్తవమైతే ఖండించాలని అన్నారు. దమ్ముంటే నిజామాబాద్ లో పోటీ చేయాలని కవితకు సవాల్ విసిరారు. 

రాష్ట్రంలో 10 విద్యుత్ ప్లాంట్స్ పెడతానని చెప్పిన కేసీఆర్.. 9 యేళ్లలో 2 ప్లాంట్స్ మాత్రమే నిర్మించారని మండిపడ్డారు. దేశం మొత్తం మీద తెలంగాణలోనే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రం విద్యుత్ ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. విద్యుత్ బిల్లులో మోటార్లకు మీటర్లు పెట్టాలని లేదని వివరించారు. అలాగే.. కేంద్రం పసుపు పంటకు రాయితీ ఇస్తోందని అర్వింద్ తెలిపారు.