శ్రీరామునికి అసలైన వారసుల మేమే: బండి సంజయ్

శ్రీరామునికి అసలైన వారసుల మేమే: బండి సంజయ్

శ్రీ రామునికి అసలైన వారసులం తామేనన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.  పార్లమెంట్ ఎన్నికలతో  బీజేపీ  సత్తాచాటుతుందన్నారు.కోదాడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న  బండి సంజయ్..హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉంటామన్నారు.10 శాతం మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. రిజర్వేషన్లు ఇస్తే ముస్లిం నాయకులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలో  కనీసం రెండో స్థానమైన వస్తుందో రాదోనని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు బండి సంజయ్. రాష్ట్ర బీజేపీ నాయకుల కొట్లాటతోనే కేసీఆర్ గద్దె దిగారన్నారు.  కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.  8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం కోసం కొట్లాడుతారని చెప్పారు. 11 వేల  కోట్లు ఇయ్యలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నోరు మూగపోతుందని చెప్పారు.  రాష్ట్ర ప్రజల భవిష్యత్ మేధావుల చేతుల్లో ఉందన్నారు.  ప్రశ్నించే గొంతుక బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమ్మీదర్ రెడ్డిని మండలికి పంపాలని కోరారు.

ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్  ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యంను ఇబ్బంది పెడుతుందన్నారు. బండి సంజయ్ అంటే భయంతోనే కేసీఆర్ తనను  హిందీ పేపర్ లీక్ పేరుతో  జైలుకు పంపారని ఆరోపించారు.  నిరుద్యోగుల కోసం కొట్లాడిన పార్టీ బీజేపఅ అని అన్నారు.