న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి: గౌతమ్ గంభీర్

న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి: గౌతమ్ గంభీర్

ఢిల్లీ: న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. శుక్రవారం పార్లమెంట్ సమావేశానికి హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. రేప్, మర్డర్ కేసులలోని నిందితులకు తక్కువ కాలంలోనే శిక్షలుపడేలా విచారణ జరగాలని చెప్పారు. నిందితునికి కోర్టు మరణ శిక్ష విధించాక క్షమాభిక్షకు అపీల్ చేయకుండా ఉండాలని తెలిపారు. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూస్తే తాను పోలీసులు తీసుకునే  ఎలాంటి నిర్ణయానికైనా  సపోర్ట్ చేస్తానని తెలిపారు.

అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎనౌ కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. తక్షణమే ఇన్వెస్టిగేషన్ టీంను, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ను స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా DGని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎనౌ కౌంటర్ పై పూర్తి వివరాలు అందజేయవలసిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.