
సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
ఎంఎంటీఎస్ నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎంఎంటీఎస్ నిధులకు సంబంధించి రూ. 544.36 కోట్లకు గాను.. రాష్ట్ర ప్రభుత్వము కేవలం రూ. 129 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆయన అన్నారు. మిగతా నిధులు రూ. 414 .14 కోట్లు చెల్లించాలని కోరిన కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 789.28 కోట్లు ఖర్చుపెట్టినట్లుగా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మొదటి దశ ఎంఎంటీఎస్‌కు అనుసంధానంగా రెండో దశ పనులకు కూడా కేంద్ర ప్రభుత్వం 2014లోనే సిగ్నల్ ఇచ్చింది. అప్పటి అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్
రూ. 816.55 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 544.36 కోట్లు. వాటిలో ఇంకా రూ. 414 కోట్లు ఇవ్వలేదు. కాలంతో పాటు ప్రాజెక్ట్ వ్యయం కూడా పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు రూ. 951 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 634 కోట్లు కాగా.. రూ. 317 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా. అయితే ఇప్పటికే కేంద్రం ఖర్చు పెట్టవలసిన దానికన్నా రెండింతలు ఎక్కువ ఖర్చుపెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది.
అదేవిధంగా యాదాద్రి అనుసంధానం చేయడానికి ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనులు మొదలు పెట్టాలి. ఈ ప్రాజెక్ట్ కోసం 2016-17లోనే రైల్వే శాఖ రూ. 412 కోట్ల వ్యయంతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 75 కోట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం ముందుగా చెల్లించాలని కోరింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఈ డబ్బులు చెల్లించలేదు. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నాను.
పూర్తి లెటర్ కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి
For More News..