
- ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్
హైదరాబాద్,వెలుగు: బీఆర్ఎస్ నేతలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్‌రావు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, ఏసీబీ స్పందించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు. వారి పాపపు పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం బీజే పీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
దుబ్బాక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన డీసీపీ సందీప్ రావు సహా, కవిత చెప్పని జీవోల గురించిన అక్రమాలను కూడా బయట పెట్టాలని ఆయన కోరారు. దుబ్బాక ఉపఎన్నికల్లో హరీశ్‌రావు వల్ల బీఆర్ఎస్ ఓడిందని కవిత చెప్పడంతో తాను స్పందించాల్సి వస్తోందన్నారు. దుబ్బాక ప్రజలు హరీశ్‌రావుకు వ్యతిరేకంగానే తనకు ఓటేశారని తెలిపారు.