BJP పాలనలో దళితులపై వివక్ష.. అరాచకాలు, వివక్ష పెరిగిపోయాయి

BJP పాలనలో దళితులపై వివక్ష.. అరాచకాలు, వివక్ష  పెరిగిపోయాయి
  • ఖర్గే పట్ల ఆ పార్టీ శ్రేణులు అమానవీయంగా వ్యవహరిస్తున్నయ్​
  •     సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్​నేతలు

పద్మారావునగర్, వెలుగు: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించిన ప్రాంగణంలో హోమం చేసి, శుద్ధి చేయడంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా బీజేపీ నేతల మనస్తత్వంలో అంటరానితనం, దళిత వ్యతిరేక భావజాలం వీడలేదని కాంగ్రెస్​నేతలు మండిపడ్డారు. 

ఖర్గే పట్ల బీజేపీ శ్రేణులు అమానవీయంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో దళితులపై అరాచకాలు, వివక్ష పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తీరును నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ బన్సీలాల్‌‌‌‌‌‌‌‌పేట జబ్బర్ కాంప్లెక్స్ వద్ద భారీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. 

డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌‌‌‌‌‌‌‌, బాబు జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ విగ్రహాలకు నివాళులర్పించి, బైబిల్ హౌస్ వరకు పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ దళిత వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని 
హెచ్చరించారు.