బంగారం ధరలు రెండేళ్లలో రెట్టింపు కావొచ్చు.. నిహార్ ఇన్ఫో కీలక వ్యాఖ్యలు

బంగారం ధరలు రెండేళ్లలో రెట్టింపు కావొచ్చు.. నిహార్ ఇన్ఫో కీలక వ్యాఖ్యలు
  • ఒకే చోట బంగారం, ఈటీఎఫ్​, గోల్డ్​ లోన్లు ​
  • గోల్డ్​ బై బ్యాక్​ సేవలు కూడా
  • ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
  • నిహార్​ ఇన్ఫో ఫౌండర్​ సూర్య నారాయణ

హైదరాబాద్​, వెలుగు: ఈ–కామర్స్​ సేవలు అందించే హైదరాబాద్​ కంపెనీ నిహార్ ఇన్ఫోలిమిటెడ్​ బంగారం, వెండి వ్యాపారంలోకి వచ్చింది. దీనికోసం goldsilver.shop పేరుతో ప్రత్యేక వెబ్​సైట్ ​ప్రారంభించింది.  దీని ద్వారా ఫిజికల్‌‌ గోల్డ్‌‌, సిల్వర్‌‌‌‌ నాణేలు, గిఫ్టుల రూపంలో కొనుక్కోవచ్చు. ఎక్స్ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్స్​(ఈటీఎఫ్​) ద్వారా ఇన్వెస్ట్​ చేయవచ్చు. బంగారంపై లోన్లు కూడా తీసుకోవచ్చు. గోల్డ్​ బైబ్యాక్​ సేవలనూ అందిస్తున్నామని కంపెనీ ఫౌండర్​, చైర్మన్​ సూర్య నారాయణ‘వెలుగు’ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలన్నీ ఆయన మాటల్లోనే

ధరల్లో దాపరికం ఉండదు..

విలువైన లోహాలకు డిమాండ్ ​పెరుగుతుండటంతో వీటికోసం సమగ్ర ఎకోసిస్టమ్​ను నిర్మించాం.  ప్రస్తుతం పసిడి, వెండి కొనుగోళ్లు, పెట్టుబడులు, ఆర్థిక సేవలు విడివిడిగా ఉన్నాయి. వినియోగదారుడు ఒక్కో దాని కోసం ఒక్కో చోటికి వెళ్లాల్సి వస్తోంది.  ఫిజికల్ గోల్డ్‌‌,  డిజిటల్ గోల్డ్​, పెట్టుబడులను ఒకే చోట అందించడానికే గోల్డెన్ సిల్వర్ షాప్ తీసుకొచ్చాం. ఫిజికల్​ గోల్డ్​ను అమ్మేందుకు ఎంఎంటీసీ–పీఎంఎంపీతో చేతులు కలిపాం. ఈటీఎఫ్​ సేవలు అందించడానికి  జెరోదా, ఎంసీఎక్స్, ఎన్ఎస్ఐఎక్స్, ఆగ్మాంట్​తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం. బంగారానికి విపరీతంగా డిమాండ్​ ఉంది. రెండేళ్లలో ధరలు రెట్టింపైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. డిమాండ్​కు తగిన సరఫరా లేకపోవడమే కారణం.

డిసెంబరులో మొబైల్​ యాప్​ 

ప్రస్తుతం వెబ్ ద్వారా వినియోగదారులు మా సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొబైల్ యాప్‌‌‌‌ను తెస్తాం. క్యాష్ ఫ్రీ, సీఎంఎస్ లాజిస్టిక్స్ భాగస్వామ్యంతో  వేగంగా డెలివరీ ఇస్తాం. సాధారణ దుకాణాల్లో మాదిరి మా ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో రహస్య చార్జీలు ఉండవు.  బంగారంపై లోన్లు ఇవ్వడానికి బజాజ్​ వంటి ఎన్​బీఎఫ్​సీలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నామని సూర్యనారాయణ వివరించారు.

పెట్టుబడులకు ఎన్నో మార్గాలు

తక్కువ రూపాయల మొత్తాలతో మైక్రో ఇన్వెస్ట్​మెంట్లు, ఫ్రాక్షనల్ అక్యుములేషన్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్​లు) ​, ఆటోమేటెడ్ పీరియాడిక్ కొనుగోళ్ల ద్వారా కస్టమర్లు విలువైన లోహాల్లో ఇన్వెస్ట్​ చేయవచ్చు. రియల్ టైమ్ డైనమిక్ ప్రైసింగ్, లైవ్ ట్రాకింగ్ డాష్‌‌‌‌బోర్డ్‌‌‌‌లు, ఫిజికల్ కన్వర్షన్ ఆప్షన్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ ట్రెండ్స్​, ట్యాక్స్ గైడ్‌‌‌‌లను వాడుకోవచ్చు.