జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఊహించని పరిణామం ఎదురైంది. జేపీ నడ్డా అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. కొంతమంది గుర్తు తెలియని సైబర్ కేటుగాళ్లు జేపీ నడ్డా అకౌంటును హ్యాక్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో రుజువైంది. నడ్డా ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన దుండగులు..‘రష్యా ప్రజలకు అండగా ఉందాం. వారి కోసం బిట్ కాయిన్, ఇథేరియమ్ ద్వారా విరాళాలు అందించండి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాకయిందని గ్రహించిన ఆయన కార్యాలయ సిబ్బంది.. ఆ పోస్టులను వెంటనే తొలగించారు. అనంతరం ట్విట్టర్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదించి ఖాతాను పునరుద్ధరించారు.

మరిన్ని వార్తల కోసం:

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది