కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని ట్రక్పార్క్భూముల విక్రయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ లీడర్లు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో దీక్ష చేశారు. ట్రక్ పార్క్ భూములను విక్రయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ట్రక్ పార్క్కోసం రైతుల నుంచి లక్ష రూపాయలకు ఎకరం చొప్పున ప్రభుత్వం సేకరించిందని, ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం కోట్ల రూపాయలకు విక్రయించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి భూములు అవసరం లేకపోతే తిరిగి రైతులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
