V6 News

డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలి..హుజూరాబాద్‌‌‌‌లో బీజేపీ నిరసన

డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలి..హుజూరాబాద్‌‌‌‌లో బీజేపీ నిరసన

హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుజూరాబాద్ పట్టణ, రూరల్ నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన, రాస్తారోకో చేపట్టారు. 

బీజేపీ శ్రేణులు చేపట్టిన రాస్తారోకోతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్‌‌‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి నాయకులు కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అనంతరం బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల హుజూరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుందన్నారు.