రేవంత్‌‌‌‌ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు

రేవంత్‌‌‌‌ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు

ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ఖమ్మంలో గడ్డపార రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్​ బాధితులను ఆయన పరామర్శించి మాట్లాడారు. బాధితులందరికీ కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

వెలుగుమట్ల పక్కన జాతీయ రహదారి రావడం వల్ల భూమి విలువ పెరిగిందని, అధికార పార్టీకి సన్నిహితులైన వ్యాపారులకు ఆ భూములను కట్టబెట్టేందుకే ఇండ్లు కూల్చారని విమర్శించారు.  బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని, న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.ఈ  కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.