రాష్ట్రానికి రానున్న సునీల్ బన్సల్..మునుగోడు ఉపఎన్నికపై చర్చ

రాష్ట్రానికి రానున్న సునీల్ బన్సల్..మునుగోడు ఉపఎన్నికపై చర్చ

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ అక్టోబర్ 1న రాష్ట్రానికి రానున్నారు. వివేక్ వెంకటస్వామి చైర్మన్ గా ఉన్న మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీతో భేటీకానున్నారు. ఆ తర్వాత మండల ఇంచార్జులు, మండల సమన్వయ కమిటీలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశమవుతారు. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించనున్నారు.
 

గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. బైపోల్ షెడ్యూల్ రాకముందే ఓవైపు ప్రచారం మొదలుపెట్టిన ఆయా పార్టీలు.. మరోవైపు జనం నాడిని పసిగట్టేందుకు వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. పార్టీ పరిస్థితి, అభ్యర్థి బలాబలాలు, జనం ఎటువైపు ఉన్నారు? వారు ఏమి కోరుకుంటున్నారు? ఏ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది? తదితర అంశాలపై సర్వే టీమ్స్ సమాచారం సేకరిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒకే సర్వే సంస్థను నమ్ముకోకుండా క్రాస్ చెక్ కోసం నాలుగైదు సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మునుగోడులో దాదాపు 15 దాకా సర్వే ఏజెన్సీలు పని చేస్తున్నాయి.  

బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా ఒక సర్వే చేయిస్తోంది. ఆ ఏజెన్సీ నేరుగా ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్ కే రిపోర్టు పంపనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్​తో సర్వే చేయించి, ఆ రిపోర్టు ఆధారంగా రాష్ట్ర పార్టీని అప్రమత్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ కూడా యూపీ నుంచి ప్రత్యేక టీమ్ లను తీసుకొచ్చి సర్వే చేయిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ మరో సర్వే చేయిస్తోంది. ఇలా బీజేపీ కూడా నాలుగు  సర్వేలు చేయిస్తోంది. ఇక కాంగ్రెస్ రెండు, మూడు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకొని ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. కేవలం పార్టీలే కాకుండా అభ్యర్థులు సైతం సొంతగా  సర్వేలు చేయించుకుంటున్నారు.