బుద్వేల్ భూములు అమ్మొద్దు.. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

బుద్వేల్ భూములు అమ్మొద్దు.. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
  • బుద్వేల్ భూములు అమ్మొద్దు
  • బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
  • పరిశీలనకు వెళ్లిన నేతల అరెస్ట్
  • అధికారంలోకి వచ్చాక రిటర్న్ తీసుకుంటం
  • కార్పొరేట్ సంస్థలకు బీజేపీ నేతల హెచ్చరిక

హైదరాబాద్ : బుద్వేల్ లో భూములు అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీ వీరేందర్ గౌడ్ నేతృత్వంలోని బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బుక్క నర్సింహారెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు గడుస్తున్నదని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాటు చేసింది కేసీఆరేనని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న విలువైన భూములను అమ్ముకుంటూ సొంత ఖజానా నింపుకుంటున్నారన్నారు. 

భూములను నమ్మితే కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఎక్కడ వచ్చిన దాఖలా లేవన్నారు. కనీసం మౌలిక వసతులు నిర్మించడానికి కూడా ప్రభుత్వ భూములు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా భూములు అమ్ముకుంటూ పెత్తందారులకు ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని బుద్వేల్ భూములను వేలంపాట వేయకుండా నిలిపివేయాలన్నా లేదంటే బిజెపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరించారు.

వేలంపాటలు భూములు కొంటున్న కార్పొరేట్ సంస్థలకు కూడా హెచ్చరిస్తున్నామని రాబోయేది బిజెపి ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు కొన్న భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ గౌడ్, బుక్క వేణుగోపాల్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్, కొమురయ్య, నందకిషోర్, మల్లేష్ యాదవ్, శ్రీధర్, కుమార్ యాదవ్, బుక్క ప్రవీణ్, వినయ్ రెడ్డి, విజయ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.