మీడియా, సోషల్​మీడియాపై బీజేపీ వర్క్​షాప్​

మీడియా, సోషల్​మీడియాపై  బీజేపీ వర్క్​షాప్​

5న హైదరాబాద్​లో పార్టీ అధికార ప్రతినిధులు,సోషల్ మీడియా ఇన్​చార్జ్​లకు ఓరియంటేషన్​ క్లాసులు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో మీడియా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమ టీమ్​లను మరింత యాక్టివ్ చేసే పనిలో పడింది. అన్ని జిల్లాల బీజేపీ అధికార ప్రతినిధులు, జిల్లాల సోషల్ మీడియా ఇన్​చార్జ్​లతో ఈనెల 5న పార్టీ స్టేట్ ఆఫీసులో వర్క్ షాపు నిర్వహించనున్నారు. మీడియా, సోషల్ మీడియాపై మంచి అనుభవం ఉన్న పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో వారికి ఓరియంటేషన్ క్లాస్ చెప్పించనున్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారాలకు ఏ రీతిలో కౌంటర్ ఇవ్వాలనే దానిపై ఇందులో వివరించనున్నారు.

7న ‘డబుల్ ఇండ్ల’ ధర్నా
అర్హులైన పేదలందరికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా 7న ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించ నున్నారు. ఈ ఆందోళనను జూన్​25న నిర్వహించాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఈ నెల 2కు వాయిదా వేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు విప్ జారీ చేయడంతో కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ఇది మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 7న నిరసన ప్రోగ్రామ్ నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.