- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల కొట్లాట డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ వంటిదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ రెండు పార్టీల నేతల కొట్లాట ఉత్తుత్తిదే అని తెలిపారు.
తాము వేరని ప్రజల్లో భ్రమలు కలిపించేందుకే ఈ రెండు పార్టీలు ఆడుతున్న నాటకమని, అందులో భాగమే కరీంనగర్ గొడవ అని విమర్శించారు. బండి సంజయ్, కౌశిక్ రెడ్డిలు తమ భాష తీరును మార్చుకోవాలని, సమాజంలో ప్రజాప్రతినిధులకు ఇలాంటి నేతల తీరువల్లే గౌరవం తగ్గుతుందని చెప్పారు.
