ఉమెన్స్ రగ్బీ లీగ్ విజేత.. బ్లాక్ ఆర్చర్స్

ఉమెన్స్ రగ్బీ లీగ్ విజేత.. బ్లాక్ ఆర్చర్స్

పద్మారావునగర్​,వెలుగు: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్​లో  తెలంగాణ ఉమెన్స్ రగ్బీ లీగ్ 2026 సీజన్-2ను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అథీనా, తెలంగాణ రగ్బీ అసోసియేషన్ బుధవారం ఘనంగా నిర్వహించాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొనగా, బ్లాక్ ఆర్చర్స్ జట్టు విజేతగా నిలిచింది.  

హైదరాబాద్ జట్టు ఫస్ట్ రన్నరప్​గా, మేడ్చల్ సెకండ్ రన్నరప్​గా నిలిచాయి. ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.