హైదరాబాద్‎లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన తెలంగాణ ఇంటెలిజెన్స్

హైదరాబాద్‎లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన తెలంగాణ ఇంటెలిజెన్స్

హైదరాబాద్: హైదరాబాద్‎లో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రను తెలంగాణ ఇంటలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీతెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి.. హైదరాబాద్‎లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం (మే 18) అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‎కు చెందిన సమీర్‎ను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్‎కు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ పేలుళ్ల గురించి సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్‎కు ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్‎తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ కుట్రను భగ్నం చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్‎తో ఉద్రిక్తతల వేళ దాదాపు కోటి మంది జనాభా నివసించే హైదరాబాద్‎లో పేలుళ్లకు కుట్ర పన్నడం సంచనంగా మారింది. ఇంటలిజెన్స్ అధికారుల అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. 

ALSO READ | హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు మూసివేత