న్యూఢిల్లీ:‘‘విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు మొత్తాన్ని ఇండియాకు రప్పిస్తా”.. 2014 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్పిన మాటిది. అధికారంలోకి వచ్చాక 2016 నవంబర్ 8న సడన్ గా ‘నోట్ల రద్దు’ నిర్ణయాన్ని ప్రకటించారు. మరి, ఇన్నేళ్లలో ఆయన బయట ఉన్న నల్లడబ్బు ను ఇండియాకు తీసుకొచ్చారా?.. దానికి సమాధానం ఏంటో గానీ.. 97 శాతం నల్లడబ్బు మన దేశంలోనే ఉందన్న విషయం తెలుసా? బయటి దేశాల్లో ఉన్నది కేవలం 3 శాతమేనన్న సంగతి తెలుసా? కేంద్ర ప్రభుత్వం చేయించిన ‘రహస్య సర్వే’ ఇదే చెబుతోంది. ఆ సర్వే ఆధారంగానే ప్రధాని మోడీ నోట్లను రద్దు చేశారంటూ ఆర్థిక శాఖలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకీ ఏంటా స్టడీ? అందులో చెప్పిన విషయాలేంటి?
మూడు సంస్థలు.. మూడు సర్వేలు
నిజానికి ఈ రహస్య సర్వే ఒకటి కాదు. దేశంలోని మూడు ప్రముఖ ఆర్థిక సంస్థలు చేశాయి. మూడు రిపోర్టులి చ్చాయి. ఆ మూడు రిపోర్టులను కలిపి ఒక రిపోర్టుగా తయారు చేసింది కేంద్రం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ ఐపీఎఫ్పీ), నేషనల్ కౌన్సి ల్ అప్లైడ్ ఎకనామిక్ రీసె ర్చ్ (ఎన్సీఏఈఆర్ ), నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ ఫైనాన్షి యల్ మేనేజ్ మెం ట్ (ఎన్ ఐఎఫ్ ఎం)లు ఆ సర్వేలు చేశాయి.
నాలుగేళ్లు సీక్రెట్ గా..
మూడు సంస్థలు 2011 నుంచి 2014 దాకా ఈ ఆర్థిక సర్వేని చేశాయి. నిజానికి ఆ స్టడీ చేయాలనుకుంటున్నట్టు 009లోని ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండిం గ్ కమిటీ నిర్ణయించింది. ‘‘లెక్కల్లో చూపని లేదా నల్ల డబ్బు , ఆస్తులను అంచనా వేసేందుకు ఆర్థిక శాఖ నిర్ణయించింది. దేశం లోపల, బయటా పాల్పడుతున్న మనీ లాండరింగ్ స్వభావాన్ని తెలుసుకునేందుకు ఈ సర్వే చేయాలనుకుంటోంది” అని చెప్పింది. ఆ తర్వా త 2010 అక్టోబర్ 28న నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ దాన్ని సూత్రప్రాయంగా ఆమోదించా రు. అప్పటి నుంచి 2011 దాకా దాన్ని లాగారు. చివరకు 2011 మార్చి 21న ఎన్ ఐపీఎఫ్ పీ, ఎన్ సీఏఈఆర్ , ఎన్ ఐఎఫ్ ఎంలకు అధ్యయన బాధ్యతలను అప్పగించిం ది. ఆ మూడు సంస్థలూ 2013 డిసెంబర్ , 2014 జూలై, 2014 ఆగస్టుల్లో నివేదికలను సమర్పించాయి. వాటన్నింటిని కలిపి 2014 డిసెంబర్ లో ప్రభుత్వం తుది నివేదికను తయారు చేసింది. ఇప్పటిదాకా ఆ నివేదికను సీక్రెట్ గానే పెట్టింది.
విడుదల చేద్దామా.. వద్దా ?
నోట్ల రద్దు జరిగి న మరుసటి ఏడాది అంటే 2017లో ఆ నివేదిక గురించి ఆర్థిక శాఖను స్టాండిం గ్ కమిటీ ప్రశ్నించింది. దీంతో ఆ నివేదికను పార్లమెంట్ సెక్రటేరియట్ కు ప్రభుత్వం పంపించింది. అక్కడి నుంచి 2017 జూలై 25న స్టాండిం గ్ కమిటీ వద్దకు చేరింది. అప్పటి నుంచి అది స్టాండిం గ్ కమిటీ చైర్మన్ వీరప్ప మొయిలీ వద్దే ఉంది. అయితే, ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో ఆ నివేదికపై పెద్ద చర్చే నడిచింది. ‘రహస్య నివేదిక’ను బహిర్గతం చేయాలని, ప్రజల ముందు పెట్టా లని బిజూ జనతాదళ్ ఎంపీ భర్తృ హరి మెహ్తాబ్ , బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేలు డిమాండ్ చేశారు. దీంతో ఆ నివేదికను బహిర్గతం చేయాలా వద్దా అనే విషయంపై మొయిలీ నేతృత్వంలోని స్టాండిం గ్ కమిటీ గురువారం సమావేశమైంది.
అందుకేనా అంత రహస్యం ?
నివేదికను రహస్యం గా ఉంచడానికి రెండు విషయాలే కారణమని భావిస్తున్నారు. ఒకటి.. నివేదికలో అందరి గురించి ఉండడం. రెండు.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు నివేదికను బహిర్గతం చేసేందుకు విముఖంగా ఉండడం. స్టాండిం గ్ కమిటీ సభ్యులు మాత్రం ఆ రెండో కారణమే నిజమని అంటున్నారు. ఎందుకంటే నివేదికల ప్రకారం రెండు పార్టీలూ ఆ టైంలో అధికారంలో ఉండడమేనని చెబుతున్నారు. 1997 నుంచి 2000 మధ్య బీజేపీ, కాంగ్రెస్ లే దేశాన్ని పాలించా యి. అయితే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మాత్రం ఆ ని వేదిక సమగ్రంగా లేదని అంటున్నారు. మూడు సంస్థలు చేసిన సర్వేల్లో నల్ల ధనానికి సంబంధించి వేర్వేరు విలువలున్నాయని అంటు న్నారు. ఆ మూడింటిని కలపడం ద్వారా దేశంలో ఎంత నల్లడబ్బుం దో చెప్పడం చాలా కష్టమని తేల్చేస్తున్నారు.

