మన వాళ్ల డేటా కాపాడేందుకే చైనా యాప్‌లు బ్యాన్‌

మన వాళ్ల డేటా కాపాడేందుకే చైనా యాప్‌లు బ్యాన్‌
  • కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్‌ చేయడం అంటే వాళ్లపై మనం డిజిటల్‌ స్ట్రైక్‌ చేయడం అని కేంద్ర మంత్రి రవిశంకర్‌‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. “ మన దేశ ప్రజల డేటాను ప్రొటెక్ట్‌ చేసేందుకు బ్యాన్‌ విధించాం. ఇది డిజిటల్‌ స్ట్రైక్‌” అని రవిశంకర్‌‌ప్రసాద్‌ అన్నారు. శాంతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన సమాధానం ఇస్తాము అని అన్నారు. మనవైపు 20 మంది సైనికులు అమరులైతే చైనాలో దానికి డబుల్‌ సంఖ్యలో చనిపోయారు. వాళ్లు కనీసం ఎంత మంది చనిపోయారనే విషయం కూడా ప్రకటించలేదు అని అన్నారు. చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేయడం వల్ల కొత్త యాప్స్‌ను తయారు చేసేందుకు మన వాళ్లకు మంచి అవకాశం అని మంత్రి అన్నారు. మనవాళ్ల డేటా చోరీకి గురవుతుందనే ఆరోపణతో చైనాకు చెందిన 59 యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. తక్కువ కాలంలోనే లక్షలాది మంది యూజర్లను ఆకర్షించిన టిక్‌టాక్‌ యాప్‌పై కూడా బ్యాన్‌ విధించారు.