వస్తలేరు..‘సర్’ నోటీసులు ఇస్తలేరు..! టైమ్ దగ్గరపడుతున్నా నత్తనడకలా బీఎల్వోల తీరు

వస్తలేరు..‘సర్’ నోటీసులు ఇస్తలేరు..! టైమ్ దగ్గరపడుతున్నా నత్తనడకలా  బీఎల్వోల తీరు
  • నోటీసులివ్వాల్సింది 97,102.. కానీ 57వేల మందికి ఇచ్చామంటున్నరు.. 
  • 21 రోజుల్లో విచారించింది 2,247 మందినే..
  • మరికొందరికి హియరింగ్డేట్ దాటిన తర్వాత నోటీసులు!! 

యాదాద్రి, వెలుగు : ‘పోతే పోతుంది వాళ్లదే ఓటు హక్కు.. నాదేం పోయింది’ అన్నట్టుగా యాదాద్రి జిల్లాలో కొందరు బీఎల్​వోలు వ్యవహరిస్తున్నారు. ఓటర్​ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవైపు గడువు తేదీ దగ్గర పడుతున్నా మ్యాపింగ్​ కాని ఓటర్లకు నోటీసులు అందించడంలో నిర్లక్ష్యం వీడడంలేదు. లెక్కల్లో ఇచ్చామని చెబుతున్నా విచారణ జరిగిన నోటీసుల సంఖ్య చూస్తే మాత్రం రానివారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. 

నోటీసులు ఇంటికాడ ఇస్తలేరు

పారదర్శకమైన ఓటరు జాబితా కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్​)పై కొందరు బీఎల్​వోలు నిర్నక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా అనేక మంది ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి నెలకొంది. యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో 2,38,040 ఓటర్లు భువనగిరిలో 2,21,903 ఓటర్లున్నారు. వీరిలో అనామలిస్​ లిస్ట్​లో 82,098, మ్యాపింగ్​ కానీ ఓటర్లు 15,004 ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పేర్లు, అక్షర దోషాలు కలిగిన ఓటర్లతోపాటు మ్యాపింగ్​ కాని వారి ఇంటికి వెళ్లి నోటీసులు అందించాల్సిఉంది. 

నోటీసులు అందించిన సమయంలో ఓటరు లేదా కుటుంబీకుల ఫొటో క్యాప్చర్​ చేయడంతోపాటు ఇచ్చినట్టుగా ఓటరు నుంచి ఎకనాలెడ్జిమెంట్​ తీసుకోవాలి. కానీ కొందరు బీఎల్​వోలు ఇవేవీ పట్టించుకోకుండా తమ సెంటర్లలోనే పెట్టేసుకుంటున్నారు. దీంతో సెంటర్ల వద్ద నోటీసులు కట్టగా ఉంటున్నాయి. దీంతో కొందరు ఓటర్లు సెంటర్​ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వాటిలో తమ నోటీసులను వెతికి తీసుకోవాల్సి వస్తోంది. నోటీసు తీసుకున్న తర్వాత సంతకం తీసుకొని ఎకనాలెడ్జిమెంట్​ ఇచ్చి ఫొటో క్యాప్చర్​ చేస్తున్నారు. 

32 వేల నోటీసులు ల్యాప్స్​

యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో డ్రాప్ట్​ ఓటర్​ లిస్ట్​లో 4,59,9433 మంది ఉన్నారు. వీరిలో అనామలిస్​, మ్యాపింగ్​ కాని ఓటర్లు 97,002 మంది ఉన్నారు. వీరందరికీ ఇవ్వాల్సిన నోటీసులను జనరేట్​ చేశారు. వీరిలో ఇప్పటివరకూ 66 వేల మందికి నోటీసులు ఇచ్చామని లెక్కల్లో పేర్కొంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో వేలాది మందికి నోటీసులు అందలేదు. నోటీసులు జారీ చేయాల్సిన తేదీ దాటిన తర్వాత కూడా ఓటర్లకు అందడం లేదు. దీంతో 32 వేల మంది ఓటర్ల హియరింగ్​ తేదీ ల్యాప్స్​ అయిపోయినట్టుగా లెక్కల్లో పేర్కొన్నారు. 

95 వేల మందిని విచారించగలరా?

21 రోజుల్లో ఇప్పటివరకూ కేవలం 2,247 మందిని మాత్రమే విచారించినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. విచారణకు మరో 11 రోజుల గడువే ఉంది. ఈ  గడువులో 95 వేల మందిని విచారించగలరా? అనే  అనుమానాలు కలుగుతున్నాయి. పోలింగ్​ సెంటర్ల వద్ద కొందరు బీఎల్​వోలు యాంత్రికంగా పని చేస్తున్నట్టు కన్పిస్తోంది. వీరి నిర్లక్ష్య వైఖరి కారణంగా ఎంతమంది ఓట్లు ఫైనల్​ లిస్ట్​లో గల్లంతవుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

‘సర్’ ప్రక్రియ వివరాలు ఇలా..