V6 News

శాంతియుత ఎన్నికల కోసం 163 యాక్టు అమలు : సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

శాంతియుత ఎన్నికల కోసం 163 యాక్టు అమలు : సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా
  • సీపీ అంబర్​ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

గోదావరిఖని, వెలుగు: శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బీఎన్ఎస్​163 యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ అంబర్​కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని కాల్వ శ్రీరాంపూర్, కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, రామగిరి, మంథని, ముత్తారం, మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు 11న జరగనున్న నేపథ్యంలో ఈ యాక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా ఈ యాక్ట్​ అమలులో ఉంటుందని, నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపు, ర్యాలీలు, సమావేశాలు చేపట్టకూడదన్నారు.