తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా బోర్డు ఏర్పాటు

తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్  గా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ పరిధిలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్​ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్​గా మారుస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం (సెప్టెంబర్​ 3‌0) న తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మారుస్తూ  ఫ్లై ఓవర్ కోసం ఆర్చ్‌ను ఏర్పాటు చేసింది. బ్రిడ్జికి ఇరువైపులా ఆర్చ్ నిర్మించింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం దగ్గర తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు 2005లో బ్రిడ్జి నిర్మించారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ని నిర్మించారు. ప్రారంభోత్సవ సమయంలో ఈనికి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అని పేరు పెట్టారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చాలని నిర్ణయించారు. జీహెచ్​ ఎంసీ మేయర్ విజయ లక్ష్మి అధ్యక్షత బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓబర్​ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.