హుండీని ఊడ్చేసి.. మళ్లీ అక్కడే పెట్టిండు.. బోయినపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఘటన

హుండీని ఊడ్చేసి.. మళ్లీ అక్కడే పెట్టిండు.. బోయినపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఘటన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని స్వర్ణధామ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దొంగ.. గర్భాలయం సమీపంలో ఉన్న హుండీని బయటకు తీసుకెళ్లి దాని తాళాలు పగులగొట్టి అందులోని రూ.50 వేల భక్తుల కానుకలను కాజేశాడు. 

అయితే ఆ ఖాళీ హుండీని ఎక్కడో పారేయకుండా, మళ్లీ తీసుకొచ్చి స్వామివారి ముందే యథాస్థానంలో భద్రంగా ఉంచి పరారయ్యాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు, అధికారులు హుండీ తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాక్​కు గురయ్యారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో దొంగ హుండీని కాజేసి, తిరిగి అక్కడే పెడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్​పల్లి పోలీసులు తెలిపారు.