బాలీవుడ్ సినీ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ సినీ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ సినీ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. 1990లో స్టార్ హీరోగా ఎదిగిన ఫరాజ్… అనారోగ్యం బారిన పడి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాల( బుదవారం) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి పూజా భట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

కొద్ది నెలల కిందట  ఫరాజ్ ఖాన్ ఛాతి, మెదడు సంబంధిత ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండటంతో కుటుంబీకులు చికిత్సకోసం బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి రావడంతో భారీ మొత్తంలో ఖర్చయింది. దీంతో ఫరాజ్ ఖాన్ కుటుంబీకులు  వైద్య ఖర్చుల కోసం దాతల సాయం కోరారు. విషయం తెలుసుకున్న నటి పూజాభట్…ఫరాజ్ ఖాన్ ఆరోగ్యపరిస్థితి ఇబ్బందులపై పై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. నటుడు సల్మాన్ ఖాన్ స్పందించి ఆర్థిక సాయం ఫరాజ్ ఖాన్ చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందజేశారు.

అప్పటి నుంచి ఆయనకు చికిత్స చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఫరాజ్ ఖాన్ మృతిచెందారని ఆయన వైద్య చికిత్సలకు సాయం చేసిన వారికి థ్యాంక్స్ చెబుతూ పూజాభట్ ట్వీట్ చేశారు.

ఫరాజ్ ఖాన్ 1990లలో వరుస విజయాలతో స్టార్డమ్ అందుకున్నాడు. ఫరేబ్ మెహందీ మైనే ప్యార్ కియా వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఆయన సినిమాలు ఫ్లాప్ కావడంతో సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు. ఫరాజ్ ఖాన్ మృతి విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.