బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తల్లి మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తల్లి మృతి

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తల్లి సలీదా బేగమ్ (95) చనిపోయారు. చాన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె జైపూర్ లో శనివారం తుది శ్వాస విడిచారు. టాంక్ అనే నవాబ్ ఫ్యామిలీకి చెందిన ఆమె కవి కూడా కావడం గమనార్హం. లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ ముంబైలోనే ఉండిపోయారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూశారు. శనివారం సాయంత్రం జైపూర్ లోని చుంగీ నాకా గ్రేవీయార్డ్ లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఈ అంత్యక్రియలు జరిగాయి.