న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్‌మాన్ ఇంటిపై ఓ దుండగుడు బాంబు విసిరాడు. అయితే అది ఇంటి గోడకు తగిలి కింద పడిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి 20 ఏళ్ల యువకుడిని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆ తర్వాత ఓపెన్ ఏఐ ఆఫీస్కు నిప్పు పెడతానని బెదిరించినట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై ఆల్ట్‌మాన్ శనివారం తన బ్లాగ్‌లో స్పందించారు. ఈ ప్రమాదంతో తన కుటుంబం దిగ్భ్రాంతికి గురైందని పేర్కొన్నారు. తన బిడ్డతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. "నా గురించి ఎవరు ఏమనుకున్నా సరే.. మా ఇంటిపై బాంబులు విసిరే ముందు ఈ ఫొటో చూసైనా ఆగుతారని ఆశిస్తున్నానని " రాశారు.
