లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బాంబు వార్తలతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
2025 నవంబర్ 10 వ తేదీన విమానంలో బాంబు పెట్టినట్లు ఏవియేషన్ అధికారులకు ఒక అగంతకుడు మెయిల్ పెట్టాడు. దీంతో విమానాన్ని ముమ్మరంగా తనిఖీ చేశారు సీఐఎస్ఎఫ్, స్ధానిక పోలీసులు. బాంబ్ స్క్వాడ్ టీమ్ లు విమానం మొత్తం గాలించి ఎలాంటి బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో 212 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా స్థానిక పోలీసులతో తనిఖీలు చేపట్టారు ఏవియేషన్ అధికారులు.
