బషీర్‌బాగ్, వెలుగు: వాటర్‌బోర్డులో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ నాయకులు సోమవారం పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిశారు. జలమండలి పరిధి పెరగడం వల్ల ఉద్యోగుల బదిలీల్లో నెలకొన్న ఆందోళనలను వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్ వెంటనే జలమండలి ఎండీతో ఫోన్లో మాట్లాడారు. మహిళా ఉద్యోగులు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారి బదిలీల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
