బోరబండలో పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ ప్రచారం... అధికారులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

బోరబండలో  పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ ప్రచారం... అధికారులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొనసాగుతోంది.  ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.  పోలింగ్ స్టేషన్ల అన్నీ పార్టీల కార్యకర్తలు బారులు తీరారు.  బోరబండ లో ఓ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యాలని కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఎన్నికల నియమాలకు విరుద్దంగా  కెసిఆర్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు.