V6 News

గ్రౌండ్ లో పార్క్ చేసిన కార్లు దగ్ధం.. బోరబండ ఎస్పీఆర్ హిల్స్ లో ఘటన

గ్రౌండ్ లో పార్క్ చేసిన కార్లు దగ్ధం.. బోరబండ ఎస్పీఆర్ హిల్స్ లో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్​లో పలు కార్లకు నిప్పంటుకుంది. ఈ గ్రౌండ్​లో రోజూ  పదుల సంఖ్యలో వాహనాలు పార్క్​ చేస్తుంటారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆరు కార్లకు నిప్పంటుకుంది. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే నాలుగు కార్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు పక్కన చెత్తకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం  జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.