పర్యావరణ పరిరక్షణ: రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ మెషీన్లు

పర్యావరణ పరిరక్షణ: రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ మెషీన్లు

పర్యావరణ పరిరక్షణపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పుగా మారటంతో ప్లాస్టిక్నియంత్రణపై దృష్టి పెట్టింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నిత్యం తాగి పడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అలా వదిలేయకుండా క్రష్ చేసేందుకు క్రష్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఉన్నఇలాంటి క్రషింగ్ మిషన్లను జంట నగరాల్లోని పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో 12, హైదరాబాద్ స్టేషన్ లో 05,  నెక్లెస్ రోడ్, బేగంపేట్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున క్రషింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో పడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఈ క్రషింగ్ మెషీన్లద్వారా ముక్కలుగా చేస్తారు. వీటిని రీసైక్లింగ్ చేసే సంస్థలకు అప్పగించనున్నారు. క్రషింగ్ మెషీన్లు 3- నుంచి 4 సెకన్లలో వాటర్ బాటిళ్లను ముక్కలుగా చేసేస్తాయి . ఈ మిషన్లద్వారా ప్లాస్టిక్ నియంత్రణలో దక్షిణ మధ్యరైల్వే తన వంతు బాధ్యతను నెరవేరుస్తుందని అధికారులు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సి.ఎస్.ఆర్ ) నిధుల ద్వారా ఈ మెషీన్లను కొనుగోలు చేశారు.