వరి కొయ్యకాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టండి

వరి కొయ్యకాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టండి
  •     ఆఫీసర్లకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు : వరి చేను కోసిన తరువాత వరి కొయ్యకాలను తగలబెట్ట కుండా చర్యలు తీసుకోవాలని అధికారుల ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ​రావు ఆదేశించారు. వరి కొయ్యకాలను కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇక ముందు ఇలాంటి వాటిని నిరోధించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించిన క్షేత్రస్థాయి అధికారులపై  చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.