బాయ్స్ హాస్టల్ ట్రైలర్ రిలీజ్..కాలేజీ యూత్కి పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్ అందాలు

బాయ్స్ హాస్టల్ ట్రైలర్ రిలీజ్..కాలేజీ యూత్కి పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్ అందాలు

నితిన్ కృష్ణమూర్తి(Nithin Krishnamurthy) డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ బాయ్స్ హాస్టల్. ఈ మూవీ  2023లో కన్నడలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్. ఇప్పుడు తెలుగులో ఆగస్టు 26న విడుదలవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ..యూత్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వెనీలా..చాక్లేట్..స్ట్రాబెరీ,జల్జీరా వంటి ఐటమ్స్ తో అమ్మాయిలను పోల్చే సీన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా..కాలేజీ యూత్ ఏదో క్రైమ్ లో ఇరుక్కున్నట్టు చూపించారు. 

ఈ మూవీలో యాంకర్ రష్మీ గౌతమ్ టీచర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. గతంలో ఇదే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అంజలీ జవేరి టీచర్ క్యారెక్టర్ లా రష్మీ గౌతమ్ రోల్ ని డిజైన్ చేసినట్టు ఉంది.ఇది ప్యాంటసీ కదా..ఏమైనా జరగొచ్చు అని  రష్మీ గౌతమ్ డైలాగ్ చెబుతూ..తన వయ్యారాలను, ఒంపు సొంపులను చూపిస్తూ కాలేజీ యూత్ కి పిచ్చెక్కిస్తోంది.దీంతో కాలేజీ పోరగాళ్లకు థియేటర్లో మాజా ఖాయం అనిపిస్తోంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios), కంటెంట్ సినిమాస్ కు కేరాఫ్ అడ్రస్ అయినా ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌(Chai Bisket Films) సంయుక్తంగా తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. 

హ్యాపీ డేస్ వంటి హాస్టల్ నేపథ్యం తో వస్తోన్న మూవీ కావడంతో హైప్ క్రియేట్ అయ్యింది.అంతే కాకుండా ఈ మూవీలో కొత్త వాళ్ళు చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ నటిస్తున్నారు.అజినీష్ లోకానాధ్(Ajaneesh Loknath) అందించిన మ్యూజిక్ ట్రెండీగా ఉంది.  బాయ్స్ హాస్టల్ తెలుగులో ఆగస్టు 26న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

బాయ్స్ హాస్టల్ లో డైరెక్టర్ తరుణ్ కుమార్ దాస్యం, కాంతారా హీరో రిషబ్ శెట్టి గెస్ట్ రోల్స్ లో నటించారు.ఈ సినిమాని వరుణ్ గౌడ, ప్రజ్వల్, అరవింద్ కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ మూవీని నిర్మించగా పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పిస్తున్నారు.