V6 News

వేలంలో రూ.2.5 కోట్లు పలికిన బ్రాడ్‌‌‌‌మన్‌‌ క్యాప్‌‌ 

వేలంలో రూ.2.5 కోట్లు పలికిన బ్రాడ్‌‌‌‌మన్‌‌ క్యాప్‌‌ 
సిడ్నీ: క్రికెట్‌‌ లెజెండ్‌‌ డాన్‌‌ బ్రాడ్‌‌మన్‌‌.. అరంగేట్రం టెస్ట్‌‌లో వాడిన బ్యాగీ గ్రీన్‌‌ క్యాప్‌‌కు వేలంలో భారీ ధర పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్‌‌ ఫ్రీడ్‌‌మన్‌‌ అనే బిజినెస్‌‌మన్‌‌.. రూ. 2 కోట్ల 50 లక్షలు చెల్లించి ఈ క్యాప్‌‌ను సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌‌ వస్తువుల వేలంలో ఇది సెకండ్‌‌ హయ్యెస్ట్‌‌ ప్రైస్‌‌ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో లెగ్‌‌ స్పిన్నర్‌‌ షేన్‌‌ వార్న్‌‌ క్యాప్‌‌ను రికార్డు స్థాయిలో రూ. 5 కోట్ల 62 లక్షలకు కొనుగోలు చేశారు. 1928 నవంబర్‌‌లో బ్రిస్బేన్‌‌లో ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో బ్రాడ్‌‌మన్‌‌కు క్యాప్‌‌ను ఇచ్చారు. 1959లో బ్రాడ్​మన్​ ఆ క్యాప్‌‌ను ఫ్యామిలీ ఫ్రెండ్‌‌ పీటర్‌‌ డన్హామ్‌‌కు గిఫ్ట్‌‌గా ఇచ్చాడు.  అయితే ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో డన్హామ్‌‌ను ఈ ఏడాది ఆరంభంలో పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. విచారణ అనంతరం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించగా, అతని దగ్గర ఉన్న బ్యాగీ గ్రీన్‌‌ క్యాప్‌‌ను వేలం వేసి ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించాలని ట్రస్టీలు నిర్ణయించారు.