కొడంగల్‌ లో ఉచిత జర్మన్‌ భాషా శిక్షణ కేంద్రం ప్రారంభం : మంత్రి వివేక్ వెంకటస్వామి

కొడంగల్‌ లో ఉచిత జర్మన్‌ భాషా శిక్షణ కేంద్రం ప్రారంభం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     టామ్‌కామ్‌ ఆధ్వర్యంలో కొడంగల్‌లో ఏర్పాటు

కొడంగల్‌, వెలుగు: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు మంత్రి వివేక్‌ ఆదేశాలతో టామ్‌కామ్‌.. కొడంగల్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో ఉచిత జర్మన్‌ భాషా శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది.

సుమారు 100 మంది నర్సులు, నర్సింగ్‌ అభ్యర్థులు ఇందులో నమోదు చేసుకోగా.. వారికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశీ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు భాషా శిక్షణతోపాటు సర్టిఫికేషన్‌, అక్కడి సంస్థలతో అనుసంధానం చేయడం వరకు టామ్‌కామ్‌  కార్యాచరణ రూపొందిస్తోందన్నారు.