బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. కేసీఆర్ కు ఆహ్వానం

బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. కేసీఆర్ కు ఆహ్వానం

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన చిన్న కొడుకు సిద్ధార్థ్.. డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోబోతున్నాడు. రీసెంట్ గా వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. 

త్వరలో జరగనున్న వీరి పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో  లేటెస్ట్ గా బ్రహ్మానందం కుటుంబ సమేతంగా ప్రగతి భవన్ న్ లో సీఎం కేసీఆర్ ను కలిసి పెళ్లి కార్డ్ ఇచ్చారు.  హైదరాబాద్ లో జరగనున్న తన కొడుకు పెళ్లికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా  బ్రహ్మానందం దంపతులకు కేసీఆర్ విషెస్  తెలిపారు. అంతేగాకుండా తాను వేసిన తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని బ్రహ్మానందం కేసీఆర్ కు కానుకగా అందజేశారు.  కేసీఆర్ దంపతులు కాసేపు వారితో ముచ్చటించారు. 

బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. ఒకరు పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్ ఎంటీ ఇచ్చారు. తర్వాత   పలు సినిమాల్లో నటించారు. గౌతమ్ కు ఇద్దరు పిల్లలు.