బ్రెజిల్‌లో మిలియన్ మార్కును దాటిన కరోనా కేసులు

బ్రెజిల్‌లో మిలియన్ మార్కును దాటిన కరోనా కేసులు

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో అత్యధికంగా 54,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య మిలియన్ మార్కును దాటింది. తాజాగా నమోదయిన కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,032,913కు చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా గత 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 1,206గా నమోదయింది. దాంతో మొత్తం మరణాల సంఖ్య 48,954కు చేరింది.

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి 5,07,000 మందికి పైగా కోలుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో 2.2 మిలియన్ల కరోనా కేసులతో యునైటెడ్ స్టేట్స్ మొదటిస్థానంలో ఉండగా.. ఒక మిలియన్ కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో కేసుల సంఖ్య రోజూ ఇలాగే వేలల్లో పెరిగితే త్వరలోనే అమెరికాను దాటేస్తుందనడంలో సందేహం లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించింది. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 8.5 మిలియన్లకు పైగా కరోనావైరస్ బారిన పడ్డారని.. 4,57,000 మందికి పైగా మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

For More News..

వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టిన కుటుంబసభ్యులు.. ఊపిరాడక..

సర్కార్ సీడ్సే మొలకలొస్తలేవ్