తొమ్మిదోసారి వరల్డ్ రికార్డు బ్రేక్

తొమ్మిదోసారి వరల్డ్ రికార్డు బ్రేక్

 సెయిట్ డెనిస్ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌):  స్వీడన్‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌ వాల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్మాండ్ డుప్లాంటిస్ తన పేరిటే ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తూ పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. సోమవారం రాత్రి స్టాండె డె ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలోని 80 వేల మంది ప్రేక్షకులు మునివేళ్లపై నిల్చొని చూస్తుండగా 24 ఏండ్ల డుప్లాంటిస్ 6.25 మీటర్ల  ఎత్తును అధిగమించి ఔరా అనిపించాడు. 

20 ఫీట్ల, 6 ఇంచుల ఎత్తును అలవోకగా అందుకున్న ఈ స్వీడిష్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన వరల్డ్ రికార్డును తానే ఏకంగా తొమ్మిదిసార్లు బ్రేక్ చేయడం విశేషం. అందుకే తను బరిలోకి రాగానే స్టేడియంలోని ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు. అంచనాలను అందుకున్న డుప్లాంటిస్‌‌‌‌‌‌‌‌  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో డైమండ్ లీగ్‌‌‌‌‌‌‌‌ పోటీల్లో  6.24 మీటర్లతో నెలకొల్పిన తన రికార్డును బ్రేక్ చేశాడు.  అయితే, ఒలింపిక్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో అతను తొలిసారి వరల్డ్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. తొలిసారి 2020లో ఫ్రాన్స్ పోల్‌‌‌‌‌‌‌‌ వాల్టర్ పేరిట ఉన్న 6.16 మీటర్ల రికార్డును అధిగమించిన  డుప్లాంటిస్ అప్పటి నుంచి 0.01మీటర్ల చొపున ఎత్తును పెంచుకుంటూ వస్తూ ఇప్పుడు 6.25 మీటర్లకు చేరుకున్నాడు.