Virat Kohli: దిగ్గజాలు చెబితే వింటాడా.. కోహ్లీ రిటైర్మెంట్‌ను ఆపుతున్న మాజీ స్టార్ బ్యాటర్స్

Virat Kohli: దిగ్గజాలు చెబితే వింటాడా.. కోహ్లీ రిటైర్మెంట్‌ను ఆపుతున్న మాజీ స్టార్ బ్యాటర్స్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం ఎవరికీ ఇష్టం లేనట్టు కనిపిస్తుంది. బీసీసీఐ, ఫ్యాన్స్, భారత మాజీ ప్లేయర్లతో పాటు ఫారెన్ దిగ్గజాలు కోహ్లీ రిటైర్మెంట్ పై వార్తలపై సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకూడదని తమ అభిప్రాయాలను తెలిపారు. 

విరాట్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. కోహ్లీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించకూడదని చాలామంది కోరుకుంటున్నారు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ " కోహ్లీపై వస్తున్న పుకార్లు నిజం కాకూడదని నేను ఆశిస్తున్నాను. విరాట్ ఇంకా చాలా టెస్ట్ పరుగులు సాధించగలడు. అతను ఉన్న ఏ జట్టు అయినా మెరుగైన జట్టు అని నేను నమ్ముతున్నాను". అని క్లార్క్ రెవ్‌స్పోర్ట్జ్‌తో అన్నారు.

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకూడదని తమ అభిప్రాయాలను తెలిపారు. సోషల్ మీడియా ద్వారా లారా పోస్ట్ చేస్తూ, "టెస్ట్ క్రికెట్ కు విరాట్ అవసరం. అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కాబోడు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటి నుంచి 60 కంటే ఎక్కువ యావరేజ్ తో పరుగులు చేస్తాడు". అని ఈ విండీస్ దిగ్గజం అన్నాడు.   

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వార్తలు బలపడుతున్నాయి. విరాట్ అకస్మాత్తుగా టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే సంగతి పక్కనపెడితే.. తన రిటైర్మెంట్ పై  కోహ్లీ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. అయితే రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే తన ఆలోచనని బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ కూడా రిటైర్ అయితే.. భారత టెస్ట్ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో అంత సీనియర్లు లేకపోవడం  భారత్ కు పెద్ద సవాల్. అప్పుడు  యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ వంటి ఆటగాళ్లపై  టీమిండియా ఆధారపడి ఉండాల్సి వస్తుంది.  ఇప్పటివరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. 46.85 యావరేజ్ తో 9230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.