కొత్తిమీరతో 147 మిలియన్స్‌!

కొత్తిమీరతో 147 మిలియన్స్‌!

కూర ఘుమఘుమలాడాలన్నా, రుచి అదిరిపోవాలన్నా కూరల్లో కొత్తిమీర ఉండాల్సిందే. అయితే కొత్తిమీర కాడల నుండి ఆకులను వేరుచేయడం మాత్రం చాలా కష్టమైన పని. ఈ పనిని ఈజీ చేస్తూ కాడనుండి ఆకులను వేరు చేసిన వీడియో సోషల్‌‌ మీడియాలో తెగ వైరల్‌‌ అవుతోంది.

కష్టమైన పనుల్ని బద్ధకస్తులకు ఇస్తే ఆ పనిని సింపుల్‌‌గా, తొందరగా, కొత్తగా ఎలా చేయాలో కనుక్కుంటారు’ అన్న మాటలను నిజం చేశాడు ఇతడు. ఖాళీగా కూర్చున్న భర్తకు కొత్తిమీర ఆకులను తుంచమని ఇచ్చింది అతని భార్య. ఒక్కొక్కటి గిల్లుకుంటు ఏం కూర్చుంటాంలే అని... ఒక ప్లాస్టిక్ కూరగాయల బుట్టను తీసుకున్నాడు. దానికున్న రంధ్రాల్లో  కొత్తిమీర కాడలను పెట్టి బయటికి లాగాడు. అంతే కాడనుండి ఆకులు కాండం నుంచి కట్‌‌ అయి బుట్టలో పడ్డాయి. అది చూసి ఆమె అవాక్కైంది. ఈ వీడియోను @ఎర్త్‌‌టాలెంట్‌‌ ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌‌లో పోస్ట్‌‌ చేసింది. అది ఇప్పుడు వైరల్‌‌ అయి 147 మిలియన్ వ్యూస్, 5 మిలియన్‌‌ లైక్స్ వచ్చాయి. ఎర్త్‌‌టాలెంట్‌‌ పేజ్‌‌కు 2.5 మిలియన్ ఫాలోవర్స్‌‌ ఉన్నారు. ‘ఐడియా చాలాబాగుంది’ అని, ‘ఇక నుండి ఈ పద్ధతినే కరివేపాకు, పుదీనా కూడా తెంపొచ్చ’ని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.