హైదరాబాద్: జాతీయ సీనియర్ విమెన్స్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు.. బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 9–16తో హిమాచల్ ప్రదేశ్ చేతిలో ఓడింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హిమాచల్‌ను అడ్డుకోలేకపోయిన తెలంగాణ ప్లేయర్లు తొలి హాఫ్‌లో 3–11తో వెనుకబడ్డారు. అయితే సెకండ్ హాఫ్‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన తెలంగాణ చకచకా పాయింట్లతో చెలరేగింది. కానీ పట్టువిడవకుండా పోరాడిన హిమాచల్ కీలక టైమ్‌లో పాయింట్లు నెగ్గి విజయాన్ని సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో ఇండియన్ రైల్వేస్ 24–22తో హరియాణాను ఓడించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్ ఆనందీశ్వర్ పాండే, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, నేషనల్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

