జగిత్యాల జిల్లాలో దారుణం.. పెన్షన్ కోసం అన్నదమ్ముల కొట్లాట

జగిత్యాల జిల్లాలో దారుణం.. పెన్షన్ కోసం అన్నదమ్ముల కొట్లాట

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో మే 5వ తేదీ శుక్రవారం పట్టపగలు హయాత్, తాజ్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది.  హయాత్, తాజ్ విజయపురి కాలనీలో నివాసముంటున్నారు. వారి తల్లి వజీర్ కూడా వారితోనే ఉంటోంది. ఆమె ప్రతి నెల వృద్యాప్య పింఛన్ తీసుకుంటుంది. అయితే ప్రతి నెల లాగే ఈ నెల కూడా పింఛన్ తీసుకుంది. ఈ క్రమంలో హయాత్, తాజ్ అన్నదమ్ములు ఆ పింఛన్ తనకు ఇవ్వాలంటే.. తనకు ఇవ్వాలంటూ గొడవకు దిగారు. క్రమంగా వారి మధ్య గొడవ పెరిగి కొట్లాటకు దారి తీసింది. 

అయితే అన్నదమ్ముల ఘర్షణను ఆపడానికి బావ సయ్యద్ నయీమ్ ప్రయత్నించాడు. తోపులాటలో అతడు కిందపడి తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. తోపులాట మధ్యలో గోడ బేస్మెంట్ రాయి తలిగి అక్కడికక్కడే చణిపోయాడు నయీమ్. హయాత్, తాజ్ ల తల్లి వజీర్ కు చెందిన రూ.2 వేల పెన్షన్ కోసం కొట్లాటలో ఈ ఘర్షణ జరిగింది.