ఎన్నికల హామీలను కాంగ్రెస్ అటకెక్కించింది : మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు

ఎన్నికల హామీలను కాంగ్రెస్ అటకెక్కించింది : మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు

మధిర, వెలుగు: కాంగ్రెస్​ ఎన్నికల హామీలను అటకెక్కించిందని బీఆర్​ఎస్​ నాయకులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్ , సీపీఎం రాష్ర్ట నాయకులు పోతినేని సుదర్శన్​, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్​రెడ్డి అన్నారు. గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో 5, 6, 7 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్​ హయాంలోనే అభివృద్ది జరిగిందన్నారు.

కేసీఆర్​ కాకతీయుల నాటి చెరువులను పూడిక తీయించి నీటి నిల్వలను పెంచి ప్రజలకు సాగు, తాగునీరు అందించారని తెలిపారు.  రైతుబంధును ప్రవేశపెట్టి రైతులకు క్రమం తప్పకుండా సాయం అందించిన ఘనత కేసీఆర్​దే అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు. బీఆర్​ఎస్​, సీపీఎం, సీపీఐ కూటమి నాయకులు పాల్గొన్నారు.