బీఆర్ఎస్​ ఓటమి స్వయం కృతాపరాదం: తమ్మినేని

బీఆర్ఎస్​ ఓటమి స్వయం కృతాపరాదం:  తమ్మినేని

సీపీఎం బతికి ఉండాలంటే బీజేపీ ఒడిపోవాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇంటింటికీ రాముడు అక్షింతలు వచ్చాయని, అవి ఓట్లుగా మారవు అని అనుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సీపీఎం ప్లీనరీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓటమి అనేది స్వయం కృతాపరాదం అని అచెప్పారు. ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధి కాకుండా అహంకారాన్ని చూశారన్నారు. కేసీఆర్ ఓటమిని హర్షిస్తూ - కాంగ్రెస్ గెలుపును స్వాగతించామన్నారు. జనరల్ ఎన్నికల్లో సాధించాల్సిన ఓట్లు సాధించలేదన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందనే బీఆర్ఎస్​ వైఖరి సరైంది కాదన్నారు. హామీల అమలును జాప్యం చేస్తూ లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుందన్నారు. 

ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశారు కానీ మిగతా నాలుగు అమలు పై క్లారిటీ ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక లోసుగుల పేరుతో . పథకాల అమలు సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే రాబోయే రోజుల్లో సీపీఎం ప్రతిపక్ష హోదా పాటించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల అనుకూల వైఖరి తీసుకుంటుందని అనుకుంటే అది భ్రమ మాత్రమేనని అన్నారు.