బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్.. నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ను గుర్తిస్తూ ఈసీ పంపిన లేఖపై రిప్లైగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవన్న హాజరయ్యారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు.. వివిధ రాష్ట్రాల రైతు సంఘం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నేతలందరికీ ప్రగతి భవన్ లో విందు ఏర్పాటు చేశారు. 

టీఆర్‌ఎస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. తెలంగాణను ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం అని సీఎం కేసీఆర్‌ దసరా రోజు పిలుపునిచ్చారు. మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని ఆ రోజే కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్‌ఎస్‌ ఇవాళ్టి నుంచి బీఆర్‌ఎస్‌గా అవతరించింది.