కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని చూడాలో: బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​

కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని చూడాలో: బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​
  • విత్తనాల కోసం పాస్ బుక్​లు క్యూలైన్లో

  • పదేండ్లు లేని కరెంట్ కోతలు మళ్లీ..

  • 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల్లోనే ఆవిష్కృతం

  • ట్విట్టర్​లో మాజీ మంత్రి కేటీఆర్​ఫైర్​

హైదరాబాద్: జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు, పాస్ బుక్​లు క్యూలైన్లో పెట్టిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. '6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం. పదేళ్లుగా కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్​సబ్​స్టేషన్ల ముట్టడి, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్​ఫార్మర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు, నీరు లేక ఎండిన పంటలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిన చెరువులు, అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి, అన్నదాతల ఆత్మహత్యలు. కాంగ్రెస్ తప్పులు-రైతుల తిప్పలు ఆగడం లేదు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో. ఎంజీఎం ఆస్పత్రిలో 5 గంటల కరెంట్​కోత బాధాకరం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తరు’ అని కేటీఆర్ ప్రశ్నించారు.