మంత్రి పొన్నంను కలిసిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి

మంత్రి పొన్నంను కలిసిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి

తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు  బీఆర్ఎస్ నేత  ఏనుగుల రాకేష్ రెడ్డి.జీవో 46 వల్ల నష్టపోతున్న గ్రామీణ విద్యార్ధులకు జరుగుతున్న నష్టం  గురించి మంత్రికి వివరించారు.

ఈ విషయంపై అసెంబ్లీలో అలాగే శాసన సభ సబ్ కమిటీలో చర్చించాలని కోరారు రాకేష్ రెడ్డి, అవసరమైతే మళ్ళీ వచ్చి  వివరిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలపై సమాలోచన చెయ్యడానికి సిద్ధమని, ఎటువంటి పత్రాలు సమకూర్చడానికైనా సిద్ధమని చెప్పారు రాకేష్ రెడ్డి. ఆగస్టు 19న  జీవో 46 పై హైకోర్టులో జరిగే విచారణకు ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా  సీఎం  రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

జీవో 46 రద్దుపై శాసనసభ సబ్ కమిటీ లో మెంబర్ గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. సాధ్యాసాధ్యాలు పరిశీలించి శాసనసభ సబ్ కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.