రేవంత్.. 12 వేల కోట్ల భూములు అమ్మిండు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

రేవంత్.. 12 వేల కోట్ల భూములు అమ్మిండు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
  •     బీఆర్ఎస్ ఎమ్మెల్యే: వివేకానంద 
  •     హిల్ట్​ పాలసీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: దాసోజు​ 

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల పునాదులపై రేవంత్​ రెడ్డి సీఎం అయ్యారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే​ కేపీ వివేకానంద అన్నారు. సీఎం అయ్యేందుకు అనేక పార్టీలు మారారని, పాలనా అనుభ వం లేదని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్​లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్​ రియల్​ ఎస్టేట్​ దందా చేస్తూ రూ.12 వేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీతో భూములను తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. 

కొడంగల్​లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్​ చేసిన రేవంత్​ రెడ్డి,  సిద్దిపేటలో హరీశ్​రావుపై పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో బెదిరించి ప్రైవేటు భూములు లాక్కుంటున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​  విమర్శించారు. హిల్ట్​పాలసీపై త్వరలోనే చార్జి షీట్​ రిలీజ్​ చేస్తామన్నారు. హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.