పోలింగ్ బూత్​ల సంఖ్య పెంచాలి:బీఆర్ఎస్

పోలింగ్ బూత్​ల సంఖ్య పెంచాలి:బీఆర్ఎస్
  • ఎలక్షన్ కమిషన్‌‌కు బీఆర్‌‌‌‌ఎస్ నేత రాకేశ్‌‌కుమార్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:జీహెచ్‌‌ఎంసీ పరిధిలో పోలింగ్ బూత్​ల సంఖ్యను పెంచాలని బీఆర్‌‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ నేత డాక్టర్ చిరుమిల్ల రాకేశ్‌‌కుమార్, దూదిమెట్ల బాలరాజు పాల్గొన్నారు. అనంతరం రాకేశ్‌‌కుమార్ మీడియాతో మాట్లాడారు.

 జీహెచ్‌‌ఎంసీ పరిధిలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఇందుకోసం పోలింగ్ బూత్​ల సంఖ్య పెంచాలని చెప్పామన్నారు. ఒక్కో బూత్​లో వెయ్యి ఓటర్లకు మించకుండా చూడాలని కోరామన్నారు. 

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఓటర్లను కొనసాగించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఓటర్ల ఎన్ రోల్ మెంట్ ఎలక్షన్ కమిషనే చేపట్టాలని కోరామని చెప్పారు.