సిద్దిపేట రూరల్, వెలుగు: తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ నేతలు పాల సాయిరాం, ఎల్లారెడ్డి అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావును కోసి వాళ్ల రక్తం పొలాల్లో చల్లాలి అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ‘రేవంత్ రక్త దాహర్తికి– మా రక్తదానం’పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరివ్వాలని డిమాండ్ చేసినందుకు సీఎం ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో లీడర్లు సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, కోల రమేశ్‌గౌడ్, రవీందర్, శ్రీకాంత్‌గౌడ్, సాయి ఈశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
